telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఈనెల 10 నుండి అక్కడ పాఠశాలలు ప్రారంభం…

school open england

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని స్థంభించిపోయేలా చేసింది. ఈ వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళు మూతపడిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్ళు ఓపెన్ చేశారు.  హైస్కూల్ విద్యార్థులకు సంబంధించిన స్కూల్స్ ను ఇప్పటికే ఓపెన్ చేశారు.  ఇక ఇదిలా ఉంటె ఉత్తర ప్రదేశ్ లో ప్రాధమిక పాఠశాలను కూడా ఓపెన్ చేయబోతున్నారు.  ఈనెల 10 వ తేదీ నుంచి 1 వ తరగతి నుంచి 10 తరగతి వరకు  పాఠశాలలు నడవబోతున్నాయి.  దీనికి సంబంధించి ప్రభుత్వం గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది.  6వ తరగతి విద్యార్థులకు సోమవారం రోజున, 7 వ తరగతి విద్యార్థులు మంగళవారం, శుక్రవారం, 8 వ తరగతి విద్యార్థులు బుధవారం తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.  ఒక్కో తరగతి గదిలో 50శాతం మంది విద్యార్థులు హాజరు కావొచ్చు.  ఇక 1 నుంచి 5 వ తరగతి వరకు విద్యార్థులకు వారంలో రెండు రోజులపాటు స్కూల్స్ కు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా మధ్యాహ్నం బోజనపథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు.

Related posts