telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గవర్నర్ ఆమోదించిన బిల్లులు కోర్టులో నిలబడవు: బోండా ఉమ

tdp bonda uma counter on ycp comments

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోద ముద్ర వేయడంపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. గవర్నర్ ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు న్యాయస్థానంలో నిలవవని స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. ఈ బిల్లులపై తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టులో స్పష్టంగా చెప్పారని ఉమ వెల్లడించారు. ఈ బిల్లులను గవర్నర్ కు పంపించి, ఆయనకు తప్పుడు సూచనలు చేసి ఆమోదం పొందారని ఆరోపించారు.

గతంలో రాజధాని అమరావతి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుని, అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని తప్పుబట్టారు. అప్పుడు ఒప్పుకుని.. ఇప్పుడు మూడు రాజధానులని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనానంతరం శాస్త్రీయబద్ధంగానే అమరావతి ఏర్పడిందని తెలిపారు. సీఎం జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి, మూడు రాజధానుల అజెండాతో ప్రజల్లోకి వెళ్లి గెలవాలని సవాల్ విసిరారు.

Related posts