telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీ హీరోలు వీరే…

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడి ఆటంకం తప్పదని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలే నిజమయ్యాయి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా టీమిండియా ఆరు టెస్ట్ సిరీస్‌లు ఆడింది. వెస్టిండీస్‌తో మొదలైన ప్రయాణం ఇంగ్లండ్‌తో ముగిసింది. ఆరు సిరీస్‌లలో న్యూజిలాండ్ జట్టుపై తప్పితే అన్ని భారత్ గెలుచుకుంది. భారత జ‌ట్టులో అత్య‌ధిక స్కోర్ చేసిన క్రికెట‌ర్‌గా వైస్ కెప్టెన్ అజింక్య ర‌హానే ఉన్నాడు. 43.80 స‌గ‌టుతో జింక్స్ 1095 ర‌న్స్ చేశాడు. స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో 1030 ర‌న్స్ చేశాడు. అత‌ని స‌గ‌టు 64.37గా ఉన్న‌ది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ 43.85 స‌గ‌టుతో 877 ర‌న్స్ చేశాడు. విరాట్ ఆస్ట్రేలియాపై చివరి మూడు టెస్టులు ఆడని విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్ టీమ్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్‌గా కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ నిలిచాడు. 58.35 స‌గ‌టుతో అత‌ను 817 ర‌న్స్ చేశాడు. విలియ‌మ్స‌న్ చేసిన పరుగులు మూడో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ కంటే కూడా తక్కువే. రెండ‌వ స్థానంలో టామ్ లాథ‌మ్ ఉన్నాడు. 40 స‌గ‌టుతో లాథ‌మ్ 689 ర‌న్స్ చేశాడు. 41.78 స‌గ‌టుతో 586 ర‌న్స్ చేసిన హెన్రీ నికోల్స్ మూడ‌వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఎలాంటి సమీకరణాలు లేకుండానే మొదటగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

భార‌త జ‌ట్టు బౌల‌ర్ల‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన రికార్డు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న‌ది. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా అశ్విన్ 20.88 స‌గ‌టుతో 67 వికెట్లు తీశాడు. పేసర్ ఇశాంత్ శ‌ర్మ 17.33 స‌గ‌టుతో 36 వికెట్లు తీశాడు. ఇక మొహ్మద్ ష‌మీ 19.77 స‌గ‌టుతో 36 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ అగ్రస్థానంలో ఉన్నాడు. సౌథీ 20.66 స‌గ‌టుతో ఇప్ప‌టి వ‌ర‌కు 51 వికెట్లు తీసుకున్నాడు. ఆ త‌ర్వాత కైల్ జేమిస‌న్ 13.27 స‌గ‌టుతో 36 వికెట్లు తీసుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ ఇప్ప‌టి వ‌ర‌కు 34 వికెట్లు ప్రాడగొట్టాడు. అత‌ని స‌గ‌టు 29.29గా ఉన్న‌ది. ఇక ఫైన‌ల్లో బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఎవ‌రు ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తారో చూడాలి.

Related posts