telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ప్లాస్మా థెరపీ కోసమే ప్రైవేట్ ఆసుపత్రికి: ఢిల్లీ ఆరోగ్య మంత్రి

Satyendar Jain

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కరోనాను జయించారు. దాదాపు నెల రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్మా థెరపీ కోసమే తాను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.తనకు కరోనా వచ్చిన వెంటనే ప్రభుత్వానికి చెందిన రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరానని తెలిపారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా ఆ ఆసుపత్రి చాలా మెరుగైనదని సత్యేందర్ చెప్పారు.

రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేరిన తర్వాత క్రమంగా తన పరిస్థితి విషమిస్తూ వచ్చిందని వెల్లడించారు. దీంతో తనకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఇవ్వాలని వైద్యులు నిర్ణయించారని అయితే దానికి అనుమతులు లేవని తెలిపారు. పర్మిషన్ కోసం తాను ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలోనే తాను ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత 10 రోజులకు సీపీటీ ఇచ్చేందుకు మన ఆసుపత్రులకు పర్మిషన్ వచ్చిందని తెలిపారు.

Related posts