ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పై రచ్చ కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు ఏపీలో లోకల్ వార్ కాస్తా… ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిపోయింది… ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం తొలివిడతకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. మొదటి విడతలో 11 జిల్లాలోని 14 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. కానీ ఇప్పటి వరకు పంచాయతీ నామినేషన్లు మొదలుకాలేదు. అటు అధికారులు నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం కాలేదు. అయితే… కొన్నిచోట్లు నామినేషన్లకు ప్రతిపక్షపార్టీలు సిద్ధమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో నామినేషన్లు స్వీకరించకపోవడంపై టీడీపీ ఆందోళన చేస్తోంది. అనంత జి్లా సోమందేపల్లిలో నామినేషన్ దాఖలుకు వచ్చి… ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ నేత వెనక్కివెళ్లిపోయారు. అటు హిందూపురం తూముకుంటలో నామినేషన్ వేసేందుకు వచ్చి ఎవరూ లేకపోవడంతో ఓ మహిళ కూడా వెనుదిరిగింది. ఇది ఇలా ఉండగా.. కాసేపట్లో సుప్రీం కోర్టులో ఏపీ పంచాయతీ ఎన్నికల కేసు విచారణ జరుగనుంది. ఈ కేసును జస్టిస్ సంజయ్‌కిషన్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనం విచారించనుంది.
previous post
next post