telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చిప్ చేతి రింగ్‌లోనో, అరికాళ్ళలోనో ఉంటే సరిపోదు..మెదడులో చిప్పు ఉండాలి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు రింగ్‌లో చిప్‌ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా చేతి రింగ్‌లోనో, మొకాళ్లల్లోనో, అరికాళ్లలోనే చిప్ ఉంటే సరిపోదు. మెదడులో చిప్పు ఉండాలని.. అప్పుడే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలో ఉంటుంది. ప్రజల కష్టాలను అర్ధం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదు’’ అని జగన్ చెప్పారు.

చంద్రబాబు, దుష్టచతుష్టయం వారి పిల్లలను, మనవళ్లను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారని.. కానీ పెద పిల్లకు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దని అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారాయణ, చైతన్యలను మాత్రమే టీడీపీ ప్రోత్సహిస్తుందన్న సీఎం జగన్‌.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ తీసుకెళ్లడానికి శ్రమిస్తోందని స్పష్టం చేశారు.

కానీ, ప్రభుత్వ స్కూళ్లలో కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అందుకే బైజూస్‌తో ఒప్పందం చేసుకన్నామని చెప్పారు. దానిని కూడా చంద్రబాబు ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్‌. ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు. ఎన్నికల దగ్గరపడే కొద్దీ దుష్టచతుష్టయం దుష్ప్రచారం ఎక్కువైంది.

అసత్యాలు, వెన్నుపోట్లు మనకు తెలీదు. వెన్నుపోటు ద్వారా అధికారం లాక్కోవడం నాకు తెలీదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేరు. ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సంక్షేమ పథకాలను ఆపేయాలన్నేదే దుష్టచతుష్టయం కుట్ర. ఓట్ల కోసం దొంగ వాగ్దానాలతో చంద్రబాబు మళ్లీ మీ ముందకొస్తారు.

వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం. కుప్పం ప్రజలు కూడా మనల్ని దీవించారు. నాకున్న ఏకైక అండాదండా ప్రజలే’ అని సీఎం జగన్‌ ఉద్వేగంగా ప్రసంగించారు

Related posts