telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పాలనలో కంపెనీలు గుడ్ బై చెబుతున్నాయి: లోకేశ్

lokesh comments on jagan on security of

ఏపీ సర్కార్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని చెప్పారు.14 నెలల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి కంపెనీలు గుడ్ బై చెబుతున్నాయన్నారు. కొత్తగా ఒక్క కంపెనీ అయినా వచ్చిందా ?’ అని లోకేశ్ ప్రశ్నించారు.

ఐదేళ్ల టీడీపీ పాలనలో 39,450 పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయని వైకాపా ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెబుతోంది’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

‘చంద్రబాబు గారు అభివృద్ధి వికేంద్రీకరణకు కేర్ అఫ్ అడ్రస్ అయితే, జగన్ గారు విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్. టీడీపీ హయాంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు అన్ని జిల్లాలకు ఎలా అందాయో ప్రభుత్వమే పూసగుచ్చినట్టు బయటపెట్టింది’ అని చెప్పారు.

Related posts