telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైలు ప్రమాదంపై వివరాలను అడిగి తెలుసుకున్న గవర్నర్‌

Tamilisai Soundararajan governor

కాచిగూడ రైల్వే స్టేషన్‌ లో ఈ రోజు ఉదయం జరిగిన రైలు ప్రమాద బాధితుల వివరాలను తెలంగాణ గవర్నర్ తమిళిసై అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు గవర్నర్‌ ఫోన్ చేశారు.మెరుగైన చికిత్స అందించాలని సూపరింటెండెంట్‌కు గవర్నర్‌ ఆదేశించారు. మరోవైపు కాచిగూడ రైల్వే స్టేషన్లలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఇంజిన్ క్యాబిన్‌లోనే లోకో పైలెట్ ఉన్నాడు.

లోకో పైలెట్‌ను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, రైల్వే రెస్క్యూ టీం శ్రమిస్తున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్‌ వద్ద ఇంటర్‌సిటీ, ఎంఎంటీఎస్‌ రైళ్లు ఢీకొన్న ఘటనలో 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. స్టేషన్‌ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ మూడు కోచ్‌లు ధ్వంసమయ్యాయి ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Related posts