telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

త్వరలో పెరగనున్న డేటా చార్జీలు..ప్రభుత్వానికి టెలికం కంపెనీల లేఖలు!

vodafone idea offer

మొబైల్ వినియోగదారులపై మరోసారి భారం మొపేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత సంక్షోభం నుంచి బయపడాలంటే ఏప్రిల్ ఒకటి నుంచి డేటా, అవుట్ గోయింగ్ చార్జీలు నిర్ణయించక తప్పదని పేర్కొంటూ ప్రముఖ టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో ఏయే చార్జీలను ఏ మేరకు పెంచాలో కూడా పేర్కొంది.

ప్రస్తుతం ఒక జీబీ డేటా సగటున నాలుగైదు రూపాయలకు లభిస్తోంది. దీనిని ఏడెనిమిది రెట్లు పెంచి కనీసం రూ.35గా చేయాలని, అవుట్ గోయింగ్ కాల్స్‌పై ప్రస్తుతం ఉన్న ఉచితాన్ని ఎత్తివేసి నిమిషానికి ఆరు పైసలను కనీస చార్జీగా నిర్ణయించాలని కోరింది.

అలాగే, కనీస కనెక్షన్ చార్జీని రూ. 50గా నిర్ణయించాలని అభ్యర్థించింది. ఇలా చేస్తే తప్ప కంపెనీల మనుగడ సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేసింది.ప్రభుత్వం కనుక ఇందుకు అంగీకరిస్తే వినియోగదారుల జేబులు చిల్లులు పడడం ఖాయం. మరోవైపు ఇంచుమించు ఇలాంటి డిమాండ్లతోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్)కు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) లేఖ రాసింది.

Related posts