telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏలూరు వింత వ్యాధి పై సీఎస్ ఆదిత్యనాధ్ కీలక ఆదేశాలు…

ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనాతో ఇబ్బందులు పడుతుంటే… ఈ మధ్యే ఏపీ ఏలూరు లో వింత వ్యాధి బయటపడింది. అయితే తాజాగా ఈ వ్యాధి అధ్యయనానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మల్టీ డిసిప్లీనరీ కమిటీ భేటీ అయింది. సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ నేతృత్వంలో ఈ కమిటీ సమావేశం అయింది. వింత వ్యాధిపై అధ్యయనం చేసి వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికలపై కమిటీలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కీలక ఆదేశాలు జారీ చేశారు.  ఏలూరు కాల్వలో నీటి కాలుష్యం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏలూరు కాల్వలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.  ఏలూరు కాల్వలో కార్లు, బైకుల వాషింగ్ కు అనుమతించొద్దని… తాగునీటి సరఫరాపై మరో ఆరు నెలల పాటు పరీక్షలు నిర్వహించాలన్నారు.  పైపు లైన్లను ఎప్పటికప్పుడు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని… సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్, నాచురల్ ఫార్మింగ్ వంటి అంశాల్లో రైతులను చైతన్యం చేయాలని ఆదేశించారు. చూడాలి మరి ఇప్పటికైనా ఈ కాలుష్యం తగ్గి ఆ వ్యాధి అంతరిస్తుందా… లేదా అనేది.

Related posts