నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో పాటు పలువురు నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్.. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు 11:40 గంటలకు చేరుకోనున్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ స్వాగతం పలకనున్నారు.
అనంతరం 22 కి.మీ. జరిగే భారీ రోడ్‌షోలో ఇరువురు నేతలు పాల్గొంటారు. మార్గమధ్యంలో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన మోతెరా స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరవుతారు.