telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

ముగిసిన ఏపీ ఎంసెట్‌.. నేడు ప్రాథమిక ‘కీ’ విడుదల

Degree exams TDP questiona Anantapur

ఏపీ ఎంసెట్‌-2019 ప్రవేశ పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి. బుధవారం వీటికి సంబంధించిన ప్రాథమిక ‘కీ’ విడుదల కానుంది. తుదిరోజు జరిగిన పరీక్షకు 94.8% మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 95.42% మంది, తెలంగాణలో 90.61% మంది పరీక్ష రాశారు. కాగా, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి సెషన్ల వారీగా మాస్టర్‌ ప్రశ్నపత్రాలు, వాటి ప్రాథమిక ’కీ’లను బుధవారం మధ్యాహ్నం ఎంసెట్‌ వెబ్‌సైట్లో పొందుపరుస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు.

విద్యార్థి మెయిల్‌ ఐడీకి సంబంధిత ప్రశ్నపత్రం పంపుతామని చెప్పారు. దీంతో పాటు ప్రతి ప్రశ్నకు కుడి పక్కన విద్యార్థి ఎంపిక చేసిన ఆప్షన్‌ ఇస్తారు. ప్రశ్నలోని 4 ఆప్షన్లలోసరైన ఆప్షన్‌ గ్రీన్‌ మార్క్‌గాను, మిగిలిన 3 తప్పు ఆప్షన్లు రెడ్‌ మార్కులో ఉంటాయన్నారు. ప్రాథమిక ’కీ’పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26 సాయంత్రం 5 గంటలలోగా [email protected] మెయిల్‌ ఐడీకి అభ్యంతరాలను నిర్దేశించిన ఫార్మాట్‌లో పంపాలని సూచించారు.

Related posts