telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ అల్లర్ల ఘటనపై.. రాష్ట్రపతిని కలిసిన సోనియా

soniya gandhi

ఢిల్లీలో గ‌త మూడు రోజుల క్రితం సీఏఏ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య 38కి చేరుకుంది. గాయపడిన వారిలో మరో 11 మంది ఒక్కరోజు వ్యవధిలోనే మృతి చెందారు. అల్లర్ల ఘటన నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు.

తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన రెండు వ‌ర్గాలు ఒక‌రిపై ఒక‌రు రాళ్లు రువ్వుకున్నారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 48 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అల్లర్లపై దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాల (సిట్)ను ఏర్పాటు చేశారు. 514 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని ఆ పార్టీ నేతలు నిన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధాజ్ఞలను నేడు పది గంటలపాటు సడలించనున్నట్టు హోంశాఖ తెలిపింది.

Related posts