telugu navyamedia
సినిమా వార్తలు

మికా సింగ్ పై నిషేధం ఎత్తివేసిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ

Mika-Singh

కశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో పాక్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మ‌న సినిమాల‌తో పాటు క‌ళాకారుల‌ని నిషేదించింది. ఈ నేపథ్యంలో ప్ర‌ముఖ గాయ‌కుడు మికా సింగ్ పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు చెందిన సమీప బంధువు ఇంట్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి త‌న టీంతో వెళ్ళాడు. భార‌త్ – పాక్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న స‌మ‌యంలో మికా సింగ్ పాక్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డంపై భారతీయులు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) అతనిపై నిషేధం విధించింది. దేశంలో పాటలు పాడడం, బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సినిమాల్లో నటించడం పైనా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఎఫ్‌డబ్ల్యూఐసీ ఆదేశాలు కూడా జారీచేసింది. అయితే దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన మికాసింగ్ .. ముందుగా ఖరారైన కార్యక్రమం కావడంతో పాకిస్థాన్ లో ప్రదర్శన ఇచ్చానని, తన వల్ల తప్పు జరిగిందని, ఇలాంటి తప్పు భవిష్యత్ లో చేయనని మీకాసింగ్ క్షమాపణలు చెప్పారు. ఆర్టిక‌ల్ 370కి ర‌ద్దు ముందే పాక్ ప్ర‌ద‌ర్శ‌న‌కి సంబంధించి సంత‌కం చేశాను. వీసా కూడా రావ‌డంతో పాక్‌కి వెళ్లి ప్ర‌ద‌ర్శించాను. నేను చేసింది త‌ప్ప‌ని తెలుసు. మ‌రోసారి ఇలాంటివి జ‌ర‌గ‌నివ్వ‌ను అని మికాసింగ్ వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో అత‌నిపై నిషేదం ఎత్తివేసింది ఎఫ్‌డబ్ల్యూఐసీఈ.

Related posts