telugu navyamedia
సినిమా వార్తలు

పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన అందాల చంద‌మామ కాజల్‌..

అందాల చంద‌మామ ,హీరోయిన్ కాజల్‌ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. కాజల్-గౌతమ్‌ కిచ్లు దంపతులకు మంగళవారం(ఏప్రిల్‌ 19) మగబిడ్డకు జన్మనిచ్చారు.

అయితే దీనిపై ఇప్పటి వరకు కాజల్‌ కానీ, ఆమె భర్త గౌతమ్‌ కిచ్లు కానీ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే కాజల్‌ దంపతులకు మగబిడ్డ పుట్టాడంటూ పలు నేషనల్‌ వెబ్‌సైట్స్‌ తమ కథనంలో పేర్కొన్నాయి.

Kajal Aggarwal And Her Hubby, Gautam Kitchlu Embrace Parenthood, Blessed  With A Baby Boy

అంతేకాదు ప్రముఖ సెలబ్రెటీ ఫొటోగ్రాఫర్‌ వైరల్‌ భయాని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కాజల్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘బేబీ బాయ్‌(Baby Boy)’ అని స్పష్టం చేశాడు

టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్.. అక్టోబర్ 30, 2020లో ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం జరిగింది. అప్పుడు లాక్ డౌన్ కావడంతో కొంత మందిని మాత్రమే పెళ్ళికి ఆహ్వానించారు.

Pregnant Kajal Aggarwal makes a public appearance with her baby bump; viral  video

మ్యారేజ్‌ తర్వాత కూడా కాజల్‌ సినిమాలు చేసింది.  ఆచార్య సినిమా షూటింగ్​లో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ అగర్వాల్ ప్రెగ్రెంట్ అయ్యారనే వార్తను భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Kajal Aggarwal Flaunts Baby Bump With Husband Gautam Kitchlu; See Pic

ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఇటీవల కాజల్ బేబీ బంప్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆమె ఏప్రిల్‌ 19న(నేడు) మగబిడ్డకి జన్మనివ్వడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts