telugu navyamedia
సినిమా వార్తలు

షాకింగ్ లుక్ లో రవితేజ

Raviteja

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ తాజా చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి “డిస్కో రాజా” అనే టైటిల్ ను ఖరారు చేశారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం. బటర్ ఫ్లై ఆకారంలో డిస్కో అని ఇంగ్లీష్ లో రాజా అని తెలుగులో ఉన్న ఈ టైటిల్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. టైటిల్ క్రింద ఉన్న రివైండ్… ఫార్వార్డ్… కిల్… అని ఉన్న లైన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవితేజ సరికొత్త లుక్ తో షాకిచ్చాడు. గత సినిమాల్లో దాదాపు కాస్త సన్నగానే కనిపించి కాస్త నెగిటివ్ కామెంట్స్ ను ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు అన్ని విమర్శలకు చెక్ పెట్టేలా మంచి ఫిట్ నెస్ తో కన్పిస్తున్నారు. అయితే సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడు. ఒక వృద్ధిడి పాత్రలో అలాగే కండలు తిరిగిన యువకుడిగా కనిపిస్తాడట. ఈ సినిమాకి ముందు రవితేజ చేసిన మూడు సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ సినిమాతోనైనా హిట్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు మాస్ రాజా రవితేజ. వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రమైనా రవితేజకు హిట్ ను అందిస్తుందేమో చూడాలి.

Related posts