telugu navyamedia
సినిమా వార్తలు

టాలీవుడ్​లో మరో విషాదం..దర్శకుడు తాతినేని రామారావు ఇక లేరు

ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్​ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున చెన్నై లో మరణించారు . ఆయన వయసు 84 సంవత్సరాలు.

1950 వ సంవత్సరం రామారావు తన సమీప బంధువైన తాతినేని ప్రకాశరావు దగ్గర సహాయ దర్శకుడుగా చేరారు .ఆ తరువాత ప్రత్యగాత్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు . 1966లో అక్కినేని నాగేశ్వర రావు సావిత్రి నటించిన నవరాత్రి అన్న సినిమాతో దర్శకుడయ్యారు . రామారావును ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఏ .వి . సుబ్బారావు దర్శకుడుగా పరిచయం చేశారు .

Tollywood Director Tatineni Ramarao Passed Away - Sakshi

1966 నుంచి 2000 వరకు తెలుగు , హిందీ భాషల్లో 70 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు . రామారావు కు భార్య జయశ్రీ , కుమారుడు అజయ్ , కుమార్తెలు చాముండేశ్వరి , నాగ సుశీల వున్నారు .

కాగా, ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు

Related posts