telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా ప్రిన్సెస్ పెళ్ళి చేసుకోబోయేది ఇతన్నే…!

Niharika

గురువారం ఉదయం నుంచి నిహారిక తన పెళ్లికి సంబంధించిన హింట్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫేస్ కనిపించకుండా తనకు కాబోయే వాడి ఫొటో రివీల్ చేసి మరింతగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఎట్టకేలకు నిహారికను పెళ్లి చేసుకోబోయే చైతన్య ఫేస్ రివీలైంది. అబ్బాయి పేరు వెంకట చైతన్య జొన్నలగడ్డ. ఇక నిహారిక పెళ్లి గురించి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం… ఈ సంబంధాన్ని మెగా బ్రదర్స్ అందరూ మాట్లాడుకునే ఫైనలైజ్ చేశారని తెలుస్తుంది. చైతన్య విషయానికి వస్తే.. అతను ఓ ఎమ్.ఎన్.సి. కంపెనీలో ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్నారట. గుంటూరు ఐజీ కుమారుడు అని తెలుస్తుంది. అలాగే అతను పేరున్న ఓ కాలేజీలో మేనేజ్‌మెంట్ గ్యాడ్యుయేట్‌గా చేస్తున్నారట. ఇక నిహారిక, చైతన్యల నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిపి, వివాహం ఇయర్ ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి 2021లో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్. అంతే కాదు ఈ వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Related posts