telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజతో మరోసారి… శృతి హాసన్ రీఎంట్రీ

RT66

శృతిహాసన్ ఇటీవ‌ల తన ప్రేమ‌కి ఎండ్ కార్డ్ ప‌డడంతో మ‌ళ్ళీ సినిమాల‌పై దృష్టి సారించింది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన లాభం అనే చిత్రం చేస్తుంది, దీంతో పాటు అమెరికాకి చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శృతి హాస‌న్ కీల‌క పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొంద‌నున్న ట్రెడ్ స్టోన్‌ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు. నీరా ప‌టేల్ అనే పాత్ర‌లో శృతి క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది. కాగా… మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తోన్న 66వ చిత్రాన్ని దీపావ‌ళి సంద‌ర్బంగా అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా త‌రకెక్కుతుంద‌ని నిర్మాత ఠాగూర్ మ‌ధు తెలిపారు. డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. 2017 త‌ర్వాత శృతిహాస‌న్ తెలుగులో న‌టిస్తున్న చిత్ర‌మిది. ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన సూప‌ర్‌హిట్ చిత్రం `బ‌లుపు`లోనూ శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు అదే సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ రిపీట్ కానుంది. డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఈ సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. వీరిద్ద‌రి హ్యాట్రిక్ సినిమా కావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభిస్తామ‌ని, అలాగే సినిమాకు సంబంధించిన మిగిలిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియజేసింది.

Related posts