telugu navyamedia
సినిమా వార్తలు

మంచు విష్ణు.. ‘జిన్నా’ ఫస్ట్ లుక్ రిలీజ్ ..

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘జిన్నా’. ఈ చిత్రంలో విష్ణుకి జోడిగా శృంగార తార సన్నీ లియోన్, హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు.

ఫన్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రంతో సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. అయితే, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో దీన్ని రూపొందించారు.

‘విష్ణు సర్‌.. షాట్‌ రెడీ అయ్యింది’ అని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వచ్చి ఎన్నిసార్లు పిలిచినా.. విష్ణు సెట్‌లోకి అడుగుపెట్టరు.

దీంతో విసిగిపోయిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌.. కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌ ఇచ్చిన సలహాతో విష్ణు వద్దకు వెళ్లి ‘జిన్నా.. షాట్‌ రెడీ’ అని చెప్పడం.. దానికి ఆయన ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకునేలా ఉంది.

ఇందులో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో గాగుల్స్ ధరించి విష్ణు సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఫుల్ యాటిట్యూడ్ తో మాస్ అండ్ క్లాస్ టచ్ తో జిన్నా ఫస్ట్ లుక్ లో ఆక‌ట్టుకున్నారు. ఓవరాల్ గా మంచు విష్ణు జిన్నా ఫస్ట్ లుక్ సూపర్ స్టైలిష్ గా అదిరిపోయింది.

Related posts