ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సంచలనాలు సృష్టించే రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నే టార్గెట్ చేశారు. ‘పవర్ స్టార్’ పేరుతో సినిమా ప్రకటించి వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తన సినిమాకు ”ఎన్నికల తర్వాత కథ” అనే ట్యాగ్ లైన్ పెట్టి అచ్చం పవన్ కళ్యాణ్, చిరంజీవిని రూపురేఖలతో ఉన్న నటులను ఎంపిక చేసుకొని సినిమా స్టార్ట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ క్రమంలోనే ‘పవర్ స్టార్’కి పోటీగా ‘పరాన్నజీవి’ రంగంలోకి దిగింది. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న చాలా మందిపై సెటైరికల్ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మకే సూటి పెట్టేసి ‘పరాన్నజీవి’ సినిమాను అనౌన్స్ చేశారు పవన్ ఫ్యాన్స్. ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ డాక్టర్ నూతన్ నాయుడు దర్శకత్వంలో 99 థియేటర్ బ్యానర్‌పై స్కై మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రానికి సీఎస్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు టైటిల్ లుక్ రిలీజ్ చేసి అందులో RGV అనే అక్షరాలను ఫోకస్ చేయడంతో ఫిలిం నగర్ వర్గాల్లో ఈ మూవీ గురించిన చర్చలు ముదిరాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ నిర్మాత సీఎస్ అంటే… చిరంజీవి – సురేఖలా ? లేదా చరణ్, సుష్మితలా అనే అనుమానాలు వ్యక్తం అవుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ముల్లును ముల్లుతోనే తీయాలి అనే కోణంలో ఆలోచించిన మెగా ఫ్యామిలీ ఈ పరాన్న జీవికి సీక్రెట్‌గా సపోర్ట్ చేస్తున్నారనే వాదనలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.
next post
ఇక రీమిక్స్ సాంగ్స్ కు దూరం… బాలూ గారు తిడుతున్నారు : తమన్