telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీ, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే…?

Trivikram

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ “అరవింద సమేత” చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతోంది. మేలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో తండ్రి సెంటిమెంట్ ఉంటుందని అంటున్నారు. దీంతో అందరూ ఈ సినిమా “సన్నాఫ్ సత్యమూర్తికి సీక్వెల్ అనుకున్నారు. అయితే ఈ చిత్రంలో తండ్రి సెంటిమెంటు ఉంటుంది కానీ ఇది వేరే కథ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక పేర్లు విన్పిస్తున్నాయి. కానీ చిత్రబృందం అందులో “నేను-నాన్న” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన పూజాహెగ్డే నటిస్తోంది. మరో హీరోయిన్ గా కేథరిన్ ట్రెసాను ఎంపిక చేసుకున్నారని టాక్. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “సన్నాఫ్ సత్యమూర్తి” కూడా ఇదే కోవలోకి వస్తుంది. అంతేకాదు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన “అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత” వంటి చిత్రాలు కూడా తండ్రి సెంటిమెంటుతో ఉండేవే.

Related posts