telugu navyamedia
సినిమా వార్తలు

జ‌గ‌న్ ను మళ్లీ టార్గెట్ చేస్తూ పవన్ సంచలన ట్వీట్‌..

సాయి థ‌ర‌మ్ తేజ్ రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో జ‌నఅధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ఆన్‌ లైన్‌ టికెట్‌ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వైసీపీ నాయ‌కుల‌పై సీఎం జగన్‌ పై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు కూడా చేశారు.

మ‌రోప‌క్క ప‌వ‌న్ వ్యాఖ్య‌లు మాకు ఎలాంటి సంబంధ లేద‌ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేశారు. కొంతమంది తమ అభిప్రాయాలను, ఆక్రోశాన్ని వెల్లడించారు.. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని అందులో పేర్కొన్నారు.

అయితే… పవన్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై చేసిన వ్యాఖ్యలపై  వైసీపీ మంత్రులు ఓ రేంజ్ లో విరుచుకుప‌డ్డారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే కుదరదంటూ వైకాపా నేత‌లు కౌంట‌ర్లు వేశారు.

After Pawan Kalyan's Save AP Roads drive, CM Jagan orders repair works | The News Minute

ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్‌  వైఫల్యాలపై మళ్లీ ట్విట్టర్‌ వేదికగా పవన్ స్పందించారు. వైసిపి పార్టీ… ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరియు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మద్యపాన నిషేధం, కరెంటు చార్జీలు, ఉద్యోగాల భర్తీ మరియు రాజధాని అంశం ఇలా ఎన్నో వాగ్దానాలను వైసీపీ పార్టీ ఇచ్చిందని… కానీ వాటిలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్.

అలాగే‘‘ప్రజలు మీద పన్నులు రుద్ది మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’ అంటూ పవన్ మండిపడ్డారు.

అంతేకాదు వాగ్దానాలు నెరవేర్చకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి.. నెట్టిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Related posts