telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ప్ర‌తి రోజు పండ‌గే” సెట్లో రాశిఖన్నా పుట్టినరోజు వేడుకలు

Rashi-Khanna

హీరోయిన్ రాశీ ఖ‌న్నా ఊహాలు గుస‌గుస‌లాడే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ టాప్ రేంజ్‌కి వెళ్లింది. ఒక‌ప్పుడు ఎంతో బొద్దుగా ఉన్న రాశీ ఖ‌న్నా ఈ మ‌ధ్య స‌న్న‌గా, నాజూకుగా త‌యారైంది. ఒక్క‌సారిగా రాశీని చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అయ్యారు. ఇలా మార‌డం కోసం రాశీ కొవ్వు ప‌దార్ధాల‌ని పూర్తిగా మానేసి డైట్ మెయింటైన్ చేస్తుంది. ప్ర‌స్తుతం వెంకీమామ‌, ప్ర‌తిరోజు పండ‌గే, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ్‌, సైతాన్ కా బ‌చ్చా అనే సినిమాలు చేస్తుంది. అయితే రాశీ బ‌ర్త్‌డే ఈ రోజు అయిన‌ప్ప‌టికి నిన్ననే ప్ర‌తి రోజు పండ‌గే చిత్ర బృందం కేక్ క‌ట్ చేయించింది. ఇది రాశికి 30వ పుట్టినరోజు. నిన్న‌టితో ప్ర‌తిరోజు పండ‌గే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, డిసెంబ‌ర్ 20న మూవీ విడుద‌ల‌కి సిద్ధ‌మైంది.

Related posts