కొన్ని రోజుల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మూడు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో ఒకటి పింక్ రీమేక్ కాగా.. ఆ సినిమాకి వకీల్ సాబ్ అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ మొగలాయిల కాలం నాటి పాత్రలో చేస్తున్నారు. ఈ పాత్ర దొంగ పాత్ర కాగా.. అది రాబిన్ హుడ్ లాంటి పాత్ర. ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ తన లుక్ పూర్తిగా మార్చేసుకున్నాడు. ఆ నాత్ర కోసం గడ్డం కూడా తీసేశాడు. కాస్త మీసం పెద్దదిగా ఆనాటి లుక్‌లో కనిపించాడు. లేటెస్ట్‌గా కార్యకర్తలతో మీటింగ్‌లో ఇలా కనిపించాడు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ నటించబోయే తొలి పీరియాడికల్ మూవీ ఇదే కాబోతుంది. తెలంగాణ రాబిన్ హుడ్‌గా పిలవబడే పండుగ సాయన్న జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు ‘వీర’ అట. దాంతో.. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ అనే విభిన్న టైటిల్ని ఎంపిక చేశాడట క్రిష్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ పేర్లలో కియారా అద్వానీ, వాణీ కపూర్ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.