telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తే జనవరి 26 హింసను సమర్ధించినట్టే..

keshavarao trs mp

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన..  అఖిలపక్ష సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ తరపున పార్లమెంటరీ పక్ష నేత కే కేశవరావు, లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం కే.కేశవరావు మాట్లాడుతూ.. జనవరి 26 హింస సరికాదని… ఎవరైనా ఖండించాల్సిన అంశమన్నారు. అయితే, దీన్ని సాకుగా తీసుకుని రైతు సమస్యలు, డిమాండ్లు విస్మరించవద్దని సూచించారు. తెలంగాణలో మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తున్నామని.. అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తే జనవరి 26 హింసను సమర్ధించినట్టు అవుతుందని భావించామని.. దీనిని పెద్దగా చేసి కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తి ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవసాయ చట్టాలను ఇంకా వ్యతిరేకిస్తుందని… వ్యతిరేకిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏది చేసినా మా ఎజెండా తెలంగాణ అభివృద్దే లక్ష్యమని… తెలంగాణ ప్రయోజనాల అంశంలో ఎక్కడ రాజీ ఉండదన్నారు. పార్లమెంట్ సభ్యులకు వ్యాక్సిన్ వేయకుండా సభ నడపడం బాగలేదని పేర్కొన్నారు. అఖిలపక్షం రొటీన్ గా మారిందని..ఇక్కడ మాట్లాడుకున్న అంశాలు అమలుకావడం లేదని మండిపడ్డారు. ప్రతిసారి అఖిలపక్షంలో మాట్లాడుకోవడం, తర్వాత అమలుకాకపోవడం పరిపాటిగా మారిందన్నారు. పార్లమెంట్ ఉన్నది ప్రజా సమస్యలపై చర్చించడం కోసమని.. అప్పుడే ఉత్తమ పరిష్కార మార్గాలు దొరుకుతాయని తెలిపారు. రైతు చట్టాలను మేము వ్యతిరేకించాం.. ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూడా చెప్పామని పేర్కొన్నారు. కనీసం సెలెక్ట్ కమిటీకి పంపమన్నామని… కానీ కేంద్రం పంపలేదని గుర్తు చేశారు.

Related posts