telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వ్యభిచారం తప్పుకాదు… శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

srireddy conter on dorasai movie to jivita

సంచలన నటి శ్రీరెడ్డి వేధింపుల వ్యవహారం బయటపెట్టి పలువురిపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొందరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తోంది. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో మళ్ళీ తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది శ్రీరెడ్డి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే యువ నాయకుడిగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పైకి వస్తున్న వైసిపి పార్టీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఒకరోజు జీవితంలో పెళ్ళాంగా ఉన్న చాలు నా జన్మ ధన్యం అయిపోద్ది అంటూ శ్రీరెడ్డి కామెంట్లు చేయడం జరిగింది. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్న క్రమంలో తాజాగా శ్రీరెడ్డి వ్యభిచారం చేయడంలో తప్పులు అంటూ ఇటీవల విశాఖపట్నంలో కంచరపాలం లో సెక్స్ రాకెట్ ముఠాని పట్టుకున్న పోలీసులపై షాకింగ్ కామెంట్ చేసింది. ఈ రైడ్ లో ముగ్గురు మహిళలు ఇద్దరు యువతులను మరియు అదే విధంగా ఒక విటుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందిస్తూ “వేశ్యలు అనేవాళ్లు లేకపోతే.. మీ చిన్నారి కూతుళ్లకు భద్రత లేదు. వాళ్లని ఆ పని చేయనీయండి. కనీసం మగాళ్లు జంతువులుగా మారకుండా ఉంటారు. వేశ్యలంటే దేవతలు. ఎందుకంటే వాళ్లు ఈ రకంగా సామాజిక సేవ చేస్తున్నారు. ఒకవేళ ఈ వేశ్యలే లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్‌ని ఈ మగాళ్లు రేప్ చేస్తారు” అంటూ తన పోస్టు ద్వారా హెచ్చరించింది శ్రీరెడ్డి. అంతే కాకుండా వ్యభిచారం చేస్తున్న మహిళలు మరియు మగవాళ్ళు ఆనందంగానే ఉన్నారు కదా… మీరు ఎందుకు వారిని బాధ పెడుతున్నారు ? అంటూ పోలీసులను ప్రశ్నించింది.

Related posts