వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కొడాలి నాని పై ఫిర్యాదు చేసిన వారిలో దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య, నెట్టెం రఘురాం అందరూ కలిసి వెళ్లి ఫిర్యాదు పత్రాలుతో పాటు అలాగే నాని చేసిన వ్యాఖ్యల సీడీని కూడా అందించారు.
చంద్రబాబుతో పాటు ఆయన తల్లిదండ్రులు, కుటుంబంపైనా కొడాని నాని దారుణమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలంటున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమ గారు మాట్లాడుతూ కొడాలి నాని బూతుల కారణంగా…గుడివాడ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని.. తమది గుడివాడ అని చెప్పుకోలేని స్థితికి ప్రజలు వెళ్లారని అన్నారు
చంద్రబాబు నాయుడు గారి దయవల్ల రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నువ్వు..చంద్రబాబు నాయుడుగారికి, ఎన్టీఆర్ కుటుంబానికి బూతులు తిడతావా నీకు సిగ్గుందా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గార్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ బూతు నేత కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం సీనియర్ నేతలు ఫిర్యాదు చేసారు.(1/2) pic.twitter.com/pHPaO4ctUC
— Telugu Desam Party (@JaiTDP) September 10, 2022