telugu navyamedia
సినిమా వార్తలు

లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నెగటివ్ కావాలని కోరుకుంటున్నా..

దేశంలో కరోనా మ‌హ‌మ్మారి మరోసారి విజృంభిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో కరోనా క‌ల‌క‌లం రేపుతుంది. రోజురోజుకు బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు, హీరోహీరోయిన్లు వరసగా కరోనా బారిన పడుతున్నారు.

టాలీవుడ్‌లో ఇప్పటికే మంచు మనోజ్‌, విశ్వేక్‌ సేన్,  మంచు లక్ష్మి, నిన్న సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా యంగ్‌ హీరో నితిన్‌ భార్య శాలిని కరోనా బారిన పడింది. దీంతో ఆమె ఒంటరిగా హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటోంది.

Most romantic couple .. bye again .. Shalini bustle with Nitin » Jsnewstimes

 

అయితే నేడు ఆమె పుట్టిన రోజు. భార్య బర్త్‌డే వినూత్నంగా సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు..ఆ వీడియో నితిన్ కింద కేక్ కోస్తూ ఉండగా, ఆయన భార్య పైన‌ ఇంట్లో ఉన్న కిటికీ దగ్గర నిలబడి చూస్తుండ‌గా ఆమె బర్త్ డే కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Nithin Wife Shalini Kandukuri Tested Covid 19 Positive Even He Celebrates Wife Birthday - Sakshi

‘కోవిడ్‌కి సరిహద్దులు ఉన్నాయేమో, మన ప్రేమకి సరిహద్దులు లేవు, హ్యాపీ బర్త్ డే టు మై లవ్…లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

Nithiin's sweet message for his wife Shalini Kandukuri on their first anniversary | Telugu Movie News - Times of India

నితిన్ పెట్టిన ఈ పోస్ట్ చూసి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. షాలిని పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరగా ఆమె కోవిడ్ బారినుంచి బయటపడాలని కోరుకుంటున్నారు.

Related posts