telugu navyamedia
ఆరోగ్యం

దగ్గు నుండి ఉపశమనం పొందడానికి పలు చిట్కాలు

ఈ కరోనా కాలంలో దగ్గు వస్తుందంటే చాలా భయం. ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు మనిషిని కుంగదీస్తుంది. ఒక వేళ మీకు దగ్గు ఎక్కువగా వస్తున్నా, చాతి వద్ద మంట లేదా భారంగా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. .దగ్గుకు సరైన చికిత్స వైద్యుడి ద్వారానే పొందాలనే విషయాన్ని మరిచిపోవద్దు. దగ్గు నుండి ఉపశమనం పలు సహజ చిట్కాలు

*ఓ గిన్నెలో వేడి నీరు పోసి. దుప్పటి కప్పుకొని, ఆ నీటి ఆవిరిని పీల్చాలి. ఇలా చెయ్యడం వల్ల మ్యూకస్‌ లో కణాలు ముక్కలై… శ్వాస చక్కగా ఆడుతుంది. ఈ ఆవిరి అనేది యాంటీసెప్టిక్‌లా పనిచేస్తూ… గొంతులో, ముక్కులో బ్యాక్టీరియా, క్రిములను చంపేస్తుంది కూడా.

* తేనె అనేది స్కిన్, ఆహార నాళం, శ్వాసకు ఎంతో మేలు చేస్తుంది. దగ్గు వచ్చే వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఊపిరి తిత్తులకు కావాల్సిన మాయిశ్చర్ అందిస్తుంది. అందువల్ల గోరు వెచ్చటి నీటిలో ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి. ఐతే… డయాబెటిస్ ఉన్నవారు మాత్రం తేనె ఎంత తీసుకోవాలో తగిన జాగ్రత్తలు పాటించాలి.

* దగ్గు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు రోజూ రెండు పూటల గ్లాసు పాలల్లో కాస్త అల్లం లేదా వెల్లులి వేసి మరిగించండి. ఆ తర్వాత పసుపు వేసి గోరువెచ్చగా తాగితే ఉపశమనం ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది.

* నిమ్మరసంలో విటమిన్ C ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి కాయల్లో కూడా ఇది ఎక్కువగానే ఉంటుంది. విటమిన్ C టాబ్లెట్లు వాడే బదులు సహజ పండ్లను వాడటం మేలు. నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే గొంతు గరగర తగ్గుతుంది. దగ్గు కూడా పరారవుతుంది.

* దగ్గు వచ్చే సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఫ్యాట్ ఉండే ఫుడ్ కూడా తినకూడదు. నాన్ వెజ్‌కి దూరంగా ఉంటే మంచిది. చక్కగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ఆహారం తింటే… దగ్గు త్వరగా తగ్గిపోతుంది. ఉడకబెట్టిన గుడ్లు, క్లియర్ సూప్స్ వంటివి కూడా కొంత మేలు చేస్తాయి.

* కరక్కాయ దగ్గును సహజంగా తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని బుగ్గలో పెట్టుకొని.. దీని నుంచీ వచ్చే చేదు రసాన్ని మింగేస్తూ ఉంటే… ఓ రోజంతా అలా చేస్తే… దగ్గు కచ్చితంగా తగ్గుతుంది.

* దగ్గు మరీ ఎక్కువగా ఉంటే మిరియాల కషాయం తాగండి

గమనిక : ఈ చిట్కాలు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమే.

Related posts