telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంతకు షాక్… “96” తెలుగు రీమేక్ లుక్ లీక్

Samantha

సమంత, శర్వానంద్‌ హీరోహీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాణంలో తమిళ చిత్రం “96” తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళంలో “96” సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 96 సినిమాను దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరెకెక్కించారు. ఇదే సినిమాను తెలుగులో సమంత, శర్వానంద్‌లతో తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి చూడిదార్ వేసుకున్న కొన్ని సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత ఈ సినిమాలో తమిళంలో త్రిష పోషించిన పాత్రను చేస్తోంది. ఇప్పుడు అదే లుక్‌లో ఉన్న కొన్ని సమంత ఫోటోస్ ప్రస్తుతం లీక్ అయ్యి, సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. ఇక సమంత ప్రధాన పాత్రలో వచ్చిన “ఓ బేబీ” చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

Related posts