telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ 20వ సినిమాకు సంగీత దర్శకుడిగా రెహమాన్ ?

ar-rahman

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు ఫోటోలను చిత్ర యూనిట్ మీడియాకు లీక్ చేసారు. పూజా హెగ్డే పంతులమ్మ క్యారెక్టర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ 20వ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తారనే విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Related posts