telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐదేళ్ళ తరువాత సీక్వెల్… పవర్ ఫుల్ పాత్రలో రాణి ముఖర్జీ

Mardaani

బాలీవుడ్ బ్యూటీ రాణీ ముఖర్జీ 2014లో మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన కథాంశంతో మ‌ర్ధానీ అనే చిత్రం చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్‌గా రాణీ ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచింది. ఇక ఇప్పుడు మ‌ర్ధానీ చిత్ర సీక్వెల్‌తో అల‌రించేందుకు సిద్ధ‌మైంది రాణీ ముఖ‌ర్జీ. మ‌ర్దానీ 2లో రాణీ లుక్ తాజాగా విడుద‌ల కాగా, ఇందులో ఆమె లుక్ ప‌వర్‌ఫుల్‌గా ఉంది. చిత్రంలోను త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఐదేళ్ళ త‌ర్వాత సీక్వెల్‌గా వ‌స్తున్న మ‌ర్ధానీ 2 చిత్రం మొద‌టి పార్ట్ క‌న్నా చాలా సీరియ‌స్‌గా న‌డుస్తుంద‌ట‌. విల‌న్‌కి, రాణీ ముఖర్జీకి మ‌ధ్య వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయ‌ని టాక్.ఆదిత్య చోప్రా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శివానీ శివాజీ రాయ్ అనే పాత్ర‌లో ప‌వ‌ర్ ఫుల్ సూప‌రింటెండెంట్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించ‌నుంది . నూత‌న ద‌ర్శ‌కుడు గోపి పుత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Related posts