telugu navyamedia
సినిమా వార్తలు

పుష్ప నుండి శ్రీ వ‌ల్లి ప్రోమో సాంగ్ విడుద‌ల‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పుష్ప. శేషాచలం కొండలలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక… శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండుభాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, దాక్కో దాక్కో మేక పాటకు రెస్పాన్స్ భారీగానే వచ్చింది. విడుదలైన గంటల్లోనే దాక్కో దాక్కో మేక సాంగ్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టించింది. ఈ పాటను దాదాపు ఐదు భాషలలో విడుదల చేశారు మేకర్స్.

పుష్ప : ఆకట్టుకుంటున్న 'శ్రీవల్లి' సాంగ్ ప్రోమో

తాజాగా.. ‘పుష్ప’ సినిమాలోని రష్మిక మందన పోషిస్తున్న ‘శ్రీవల్లి’ పాత్రపై రూపొందించిన ఈ పాట ప్రోమోని విడుద‌ల చేశారు.‘చూపే బంగారమయనే శ్రీవల్లి’ అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన వీడియోని 19 సెకన్ల ప్రోమోగా వ‌దిలారు.ఈ గీతాన్ని సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించగా.. చంద్రబోస్‌ రచించారు.. ఈ సాంగ్ మొత్తాన్ని రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ప్రోమో చూస్తుంటే.. మరోసారి సిధ్ శ్రీరామ్ తన గానంతో ప్రేక్షకులను ఫిదా చేయబోతున్నట్లుగా అర్థమవుతుంది.

Rashmika Mandanna's first look as Srivalli from Allu Arjun's Pushpa The Rise out now, see photo | Entertainment News,The Indian Express

ఈ మూవీలో రష్మిక హీరోయిన్​గా.. కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts