telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సస్పెన్స్‌ మిస్టరీ థ్రిల్లర్ ‘ఐఐటీ కృష్ణమూర్తి’!

పరభాషల్లో తెరకెక్కిన అనేక మిస్టరీ థ్రిల్లర్స్ తెలుగులో డబ్ అవుతున్నాయి. అలానే ‘కహాని’ లాంటి సినిమాలు ‘అనామిక’ పేరుతో రీమేక్ కూడా అయ్యాయి. అయితే… శ్రీవర్థన్ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ గా ‘ఐఐటీ కృష్ణమూర్తి’ పేరుతో ఓ మిస్టరీ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. ‘ఆ నలుగురు’ మూవీతో ప్రభుత్వ అవార్డులు, ప్రజల రివార్డులు అందుకున్న ప్రేమ్ కుమార్ పాట్ర ఈ చిత్రానికి సమర్పకుడు కావడం విశేషం. పృథ్వీ దండమూరి, మైరాదోషి, వినయ్ వర్మ, ఆనంద్ కీలక పాత్రలు పోషించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తొలికాపీ చాలాకాలం క్రితమే సిద్ధమైంది. అయితే కరోనా కారణంగా విడుదలలో జాప్యం జరిగింది. థియేటర్లు ఇప్పుడిప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా… అమేజాన్ ప్రైమ్ ద్వారా జనం ముందుకు తీసుకెళ్ళడమే బెటర్ నే నిర్ణయానికి నిర్మాత ప్రసాద్ నేకూరి వచ్చారు. ఈ మూవీలోని లిరికల్ వీడియోను ఇటీవల ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి విడుదల చేశారు. తాజా క్రేజీ డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ట్రైలర్ సైతం నెట్టింట్లో సందడి చేస్తోంది. డిసెంబర్ 10న ‘ఐఐటీ కృష్ణమూర్తి’ మూవీ అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ముంబైలో ఐఐటీ చదివిన ఓ కుర్రాడు హైదరాబాద్ కు వచ్చి కనిపించకుండా పోయిన తన బాబాయి గురించి వెదికే ప్రయత్నమే ఈ సినిమా కథ! కార్పొరేట్ క్రైమ్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది!

Related posts