telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్యతో రొమాన్స్‌ చేయనున్ననానీ హిరోయిన్‌..

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిచింది. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఈ తమిళ స్టార్ హీరో సూర్యకు అటు తమిళ పరిశ్రమతో పాటుగా ఇటు తెలుగులోనూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.  అయితే తాజాగా సూర్య తన 40వ సినిమా అప్‌డేట్‌ను ఇచ్చేశాడు. ఈ సినిమా కోలీవుడ్ స్టార్ దర్శకుడు పాండిరాజ్ డైరెక్ట్ చేయనున్నాడట. ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌ వారు ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి గతేడాది ప్రకటించిన సంస్థ హీరోయిన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవల ఈ సినిమాలో నానీ గ్యాంగ్‌లీడర్ ముద్దుగుమ్మ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించనుందని తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై డీ ఇమ్మాన్ నిర్మించనున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషన్ల గురించి ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడు చిత్రీకరణ మొదలు పెట్టోకోనున్న విషయం కూడా అతి త్వరలో తెలియనుంది.

Related posts