telugu navyamedia
సినిమా వార్తలు

అందుకే కాంచీపురం చీరకు స్పెషల్ థ్యాంక్స్ : రెడ్డి

Sameera-Reddy

టాలీవుడ్ లో “జై చిరంజీవ”, “అశోక్” వంటి సినిమాలతో స్టర్ హీరోలతో జతకట్టిన సమీరారెడ్డి అప్పట్లో తెలుగు ప్రేక్షకులను తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత పెళ్లితో సినిమాలకు దూరమైంది ఈ అమ్మడు. 2014లో అక్షయ్‌ వార్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరికి 2015లో హన్స్ పుట్టాడు. ప్రస్తుతం రెండో బిడ్డ రాకకోసం సంతోషంగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకూ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలిచిన సమీరా ఇప్పుడు సీమంతానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడయాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో సమీరా పసుపు రంగు కాంచీపురం చీరలో ఆమె మెరిసిపోయారు. ఈ సీమంతం వేడుక కొంతమంది స్నేహితులు, బంధువుల మధ్య గురువారం ఘనంగా జరిగింది. సీమంతానికి సంబంధించిన ఫొటోలతో పాటు “నవ్వితే.. ప్రపంచమంతా మనతో పాటు నవ్వుతుంది. నాకు నేనే స్పెషల్‌గా కనిపించేలా చేసిన కాంచీపురం చీరకు థాంక్స్” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు సమీరా. ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Related posts