telugu navyamedia
సినిమా వార్తలు

కవలలకు జన్మనిచ్చిన సింగర్‌ చిన్మయి..

ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త రాహుల్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్ద‌రి పిల్ల‌ల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్‌ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు.

chinmayi sripada: క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన చిన్న‌యి - chinmayi sripada  and rahul ravindran blessed with twins | Samayam Telugu

ఇద్దరిలో ఒక‌రికి ద్రిప్త అని.. మ‌రొక‌రికి శర్వాస్ అని పేరు పెట్టిన‌ట్లు తెలియజేశారు. ద్రిప్త, శర్వస్… మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చినా, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు” అని రాసుకొచ్చారు.

రాహుల్‌ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Chinmayee Sripada Bio | Indian playback singer | Our News

కాగా,ఒకే పరిశ్రమలో వేర్వేరు విభాగాలకు చెందిన ఈ ఇద్దరికీ కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడిన వీరు.. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్‌ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్టుగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును  సంపాదించుకున్నారు.

Chinmayi Sripada Rahul Ravindran Blessed With Twins, Driptah And Sharvas  Are Names Of Chinmayi Rahul Children | Chinmayi Rahul Blessed With Twins :  కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు ...

ఇక రాహుల్‌ విషయానికొస్తే.. ‘అందాల రాక్షసి’చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమయ్యాడు. హీరోగానే కాకుండా సహాయనటుడిగాను పలు సినిమాల్లో నటించాడు. నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో రాహుల్‌ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. దర్శకత్వం దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ‘చి..ల..సౌ’ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించి, తొలి ప్రయత్నంలో విజయం సాధించాడు.

Related posts