telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా ?

Kajal

టాలీవుడ్ చందమామ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని శ్రీమతిగా మారింది. హోమ్ డెకార్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీని నడిపిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు కాజల్ భర్త గౌతమ్ కిచ్లు. ప్రస్తుతం కాజల్ పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ నవ దంపతులకు స్పెషల్‌గా విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాజల్‌ అగర్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడేం సమయం మించిపోలేదు. “నేను నో చెప్పా” అంటూ ఓ పెద్ద పోస్ట్‌ని ఆమె పెట్టారు. ”ఇది చాలా లేటు అయ్యిందని తెలుసు. ఇది నేను ముందే చేయాల్సింది. ప్రపంచానికి తెలిసేలా ఇప్పుడు లెటర్‌లో ఇలా చేస్తున్నందుకు క్షమించండి. కానీ నా ఫీలింగ్స్‌ని చెప్పేందుకు ఇదే సులభమైన విధానం. తరువాత బాధపడటం కంటే ఇప్పుడే నో చెప్పడం మంచిది. ఒక చిన్న వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఇంతలా మార్చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. తెలియని శత్రువుతో ప్రపంచం మొత్తం భయపడుతున్న తీరు జీవితం గురించి నన్ను మార్చుకోనేలా చేసింది. వైరస్ నియంత్రణలో మనం ఇంకాస్త అలర్ట్‌గా ఉండాలి. భవిష్యత్‌ లైఫ్ స్టైల్‌పై నా ఆలోచన ధోరణి మారిపోతోంది. ఇప్పుడున్న నా లైఫ్‌స్టైల్‌ని పూర్తిగా మార్చుకోవాలనుకుంటున్నా. సురక్షితంగా ఉండటం కోసం, ఎంతటి కఠిన నిర్ణయానికైనా సిద్ధం” అని కాజల్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో కాజల్ అభిమానులు ఆమె సినిమాలు మానేయబోతోందా ? అనే డౌట్ తో అయోమయంతో కూడిన ఆందోళనలో ఉన్నారు.

Related posts