బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ”. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ని కేటీఆర్, చిరంజీవి కలసి విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. జనవరి 11న సంక్రాంతి కానుకగా “వినయ విధేయ రామ” చిత్రం పేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా ముగించుకుని యు/ఏ సర్టిఫికెట్ ను పొందింది.
జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ “వినయ విధేయ రామ” సినిమా స్పెషల్ షోలకి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ పండుగ రోజులలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ అదనంగా మరో రెండు షోలు వేయనున్నారు. ఇలా అదనపు షోలకి అనుమతి లభించడం వలన సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. సినిమాకు రామ్ చరణ్ యాక్టింగ్, బోయపాటి మార్క్ యాక్షన్, కైరా అద్వానీ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి.