telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇవాళ్టి నుంచి అజారుద్దీన్ ప్రెసిడెంటే కాదు : అపెక్స్ కమిటీ కౌంటర్

అజారుద్దీన్ వ్యాఖ్యలకు అపెక్స్ కమిటీ కౌంటర్ ఇచ్చింది. లోథా సిఫార్సుల నిబంధనల మేరకే ఆయనకు నోటీసులు జారీ చేశామని.. అపెక్స్ కౌన్సిల్ లోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులం చర్చించుకునే షోకాజ్ నోటీస్ పంపించామని పేర్కొంది. ఆ ఐదుగురు ఒక గ్రూప్ అని అజార్ అనడం కరెక్ట్ కాదని..ఆ ఐదుగురే అసలైన అపెక్స్ కమిటీ అని వెల్లడించింది అపెక్స్ కమిటీ. అపెక్స్ కమిటీ ఎలెక్టెడ్ బాడీ అని..అపెక్స్ కమిటీలో మొత్తం తొమ్మిది మంది.. అందులో ఒకరు ప్రెసిడెంట్ అజార్, మెన్స్ ప్లేయర్ నుంచి ఒకరు, ఉమెన్స్ ప్లేయర్ నుంచి ఒకరు, ఆడిటింగ్ నుంచి ఒకరు అని తెలిపింది. మిగతా ఐదుగురే అసలైన అపెక్స్ కమిటీ అని స్పష్టం చేసింది అపెక్స్ కమిటీ. ఆ ఐదుగురు తీసుకున్న నిర్ణయమే ఈ షోకాజ్ నోటీసులు అని.. ఈ రోజు నుండి అజారుద్దీన్ ప్రెసిడెంట్ కాదని పేర్కొంది. ఇందులో బిసిసిఐ జోక్యం ఉండదని.. అజారుద్దీ‌న్ కోర్టుకు వెళ్లి ఫైట్ చేసుకోవచ్చని పేర్కొంది. హెచ్ సిఏ మీటింగ్ లకు ఇక నుంచి అజారుద్దీన్ లా వస్తాడని.. ప్రెసిడెంట్ లా రాడని వెల్లడిచింది అపెక్స్ కమిటీ.

Related posts