సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా నటించిన “రంగస్థలం” ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే. రంగస్థలం చిత్రం బాక్సాఫీస్ దగ్గర దాదాపు 200 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిన చిత్రం రంగస్థలం. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాక బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంకి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలలో కనిపించి సందడి చేశారు. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రంగస్థలం తమిళ రీమేక్ రైట్స్ లారెన్స్ దక్కించుకోగా, చిత్రంలో ఆయన రామ్ చరణ్ రోల్ పోషించనున్నాడట. పాపులర్ తమిళ దర్శకడు లింగుస్వామి చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారని సమాచారం.
previous post