telugu navyamedia
సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్” టీజర్ అవుట్

Ismart-Shankar

పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా కనపడనున్నారు. ఈ చిత్రంలో స్టైలిష్ లుక్‌లో రామ్ కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓ హాలీవుడ్ చిత్రం ప్రేరణగా రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సాంగ్స్ చిత్రీకరణకు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ టీజర్ లో రామ్ స్టైల్, డైలాగులు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts