telugu navyamedia
సినిమా వార్తలు

ఒళ్ళు గగుర్పొడిచింది… ఫోన్ చేసి నెంబర్ సేవ్ చేసుకోండి అన్నారు…

MAharshi

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ 25వ సినిమా “మహర్షి” హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సినిమా విజయాన్ని అందుకోవడంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

“శుక్రవారం ఉదయం నిద్రలేచి ఫోన్‌ చూసుకుంటే ఓ కొత్త నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆ నంబర్‌ తెలియక ‘హలో ఎవరు’ అన్నాను. ‘నేను చిరంజీవి’ని అన్న మాట వినగానే నా ఒళ్లు గగుర్పొడిచింది. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరిగిన వాడిని. నా సినిమా గురించి ఆయన ఐదు నిమిషాలు మాట్లాడటం ఎప్పటికీ మరచిపోలేను. ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడారు. ‘వంశీ ఇదే నా నెంబర్‌ సేవ్ చేసుకోండి అన్నారు… నా సినిమాలు విడుదలైనప్పుడు డిస్ర్టిబ్యూటర్ల నుంచి ఎప్పుడూ ఫోన్లు రాలేదు. ‘మహర్షి’ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అంతా ఫోన్‌ చేసి సినిమా స్పందన బావుందని చెప్పడం చాలా ఆనందం కలిగించింది. ఈ సినిమాలో స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ, ఎమోషన్స్‌, యాక్షన్‌, కామెడీ అన్నీ ఉన్నాయి. మనం తినే తిండిని పండించే రైతు నుంచీ సొసైటీలో మనం నెగ్లెక్ట్‌ చేస్తున్న ప్రతి అంశాన్ని సినిమాలో చెప్పా. ద్వితీయార్ధం సాగదీతగా ఉందని కొందరన్నారు. క్ల్లైమాక్స్‌ అద్భుతంగా ఉందని మరికొందరు చెప్పారు. సినిమాలో ఇవే ఆలోచించాల్సి విషయాలు కాదు. దిల్‌ రాజు చెప్పినట్లు ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకున్నారనేది ముఖ్యం” అన్నారు.

రివ్యూల్లో రాసినవన్నీ ఆడియన్స్‌కి అవసరం లేదు. సినిమా ఎలా ఉందన్నదే నాకు ముఖ్యం. కంటెంట్‌ బాగుంటే అదే వసూళ్ల పరంగా ముందుకెళుతుంది. ఇది ఊహించిన విజయమే. మహేశ్‌ కెరీర్‌లో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రమిది. ఆయన కెరీర్‌కు ఓ మైలురాయిలాంటి సినిమా అవుతుందని కచ్చితంగా చెప్పగలను’’ అని దిల్‌ రాజు అన్నారు.

‘‘ఏదో సినిమా తీేసశాం అని కాకుండా హృదయాలను తాకే సినిమాను అందించారు వంశీ. మహేశ్‌ కూడా కథను బాగా నమ్మారు. కమర్షియల్‌ హంగులతో సామాజిక చిత్రం తీయడం అంత సులభం కాదు. సినిమా సక్సెస్‌ వెనుక వంశీ టీమ్‌ కృషి చాలా ఉంది. సినిమా చూసి మా అమ్మ కూడా వంశీకి ఫోన్‌ చేసి ఏడ్చేశారు. తమ్ముడు, చెల్లి కూడా భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవిగారి కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్‌ ‘ఖైదీ నెం 150’, మహేశ్‌ 25వ ‘మహర్షి’, ఎన్టీఆర్‌ 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’, సూర్య 25వ సినిమా ‘సింగం 2’ సినిమాలకు నేనే సంగీతం అందించా. ఇవన్నీ నాకు ల్యాండ్‌మార్క్‌ చిత్రాలుగా నిలిచాయి’’ అని దేవిశ్రీప్రసాద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూజా హెగ్డే సినిమా సక్సెస్‌ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Related posts