telugu navyamedia
సినిమా వార్తలు

అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ వివాహం..

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ పెళ్లి అంగ రంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో తన చిన్ననాటి స్నేహితురాలు లోహితను ప్రముఖులు, స్నేహితులు & కుటుంబ సభ్యుల సమక్షంలో, కార్తికేయ వివాహం చేసుకున్నాడు. ఇటీవల రాజా విక్రమార్క సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన లోహితకు ప్రపోజ్ చేశాడు కార్తికేయ.

BA Raju's Team on Twitter: "Hero @ActorKartikeya married his love of life Lohitha Reddy Grandly The much awaited wedding ceremony of Happening Actor Hero Kartikeya Gummakonda commenced on 21st November in Hyd

కార్తీకేయ వరంగల్‌ నిట్‌(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్‌ కోర్సు చదివేటప్పుడు ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. నేడు నవంబర్‌ 21(ఆదివారం)న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహిత మెడలో మూడు ముళ్ళుబంధంతో ఏడడుగుల వేశాడు.

hero karthikeya marriage

ఈ వివాహ వేడుకకు విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి వధూవరులను ఆశీర్వదించారు. చిరుతో పాటు అల్లు అర‌వింద్ , పాయల్​ రాజ్​పుత్​, పలువురు  సినిమా తారలు విచ్చేసి నవవదువరులను ఆశీర్వదించారు. కార్తికేయ ప్రస్తుతం తల అజిత్ తాజా చిత్రం ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు.

Related posts