telugu navyamedia
సినిమా వార్తలు

వరుణ్ బర్త్ డే స్పెషల్ సర్​ప్రైజ్..- అదిరిపోయిన ఫ‌స్ట్ గ్లింప్స్‌

మెగా హీరో వ‌రుణ్ తేజ్‌ న‌టించిన తాజా చిత్రం గ‌ని.. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరిచ‌యం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’ ఆక‌ట్టుకుంటుంది. తాజాగా ఈరోజు (బుధ‌వారం జ‌న‌వ‌రి 19న‌) వ‌రుణ్ బ‌ర్త్‌డే పురస్క‌రించుకుని ‘గ‌ని’ నుంచి ‘ప‌వ‌ర్ ఆఫ్ గ‌ని’ పేరిట‌ స్పెష‌ల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

Varun Tej's 'Ghani' Locks Release Date - Allu Bobby Ghani Saiee Manjrekar Suniel Shetty Tony Tej-TeluguStop

ఈ టీజర్‌లో వ‌రుణ్ పాత్ర‌ను ఎలివేట్ చేస్తూ చూపించారు. సునీల్ శెట్టి… వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో కోచింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సీరియ‌స్ లుక్‌లో రింగులోకి దిగిన‌ వ‌రుణ్ ప్ర‌ర్థిని మ‌ట్టి క‌రిపించాడు. కొంతమంది యోధులుగా తయారవుతారు… కానీ గని యోధుడిగా పుట్టాడు అని ఈ టీజర్‌కు క్యాప్షన్ ఇచ్చారు.

Ghani first look: Ram Charan unveils Varun Tej's boxer avatar | Entertainment News,The Indian Express

త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. న‌దియా మ‌రో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న‌ ఈ మూవీ మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related posts