telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్లి చేసుకున్న ప్రభాస్‌ భామ..!

కన్నడ నటి సంజనా గల్రానీ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్‌. ప్రభాస్‌ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంజన.. “సత్యమేవ జయతే”, అవును-2, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ తదితర చిత్రాల్లో నటించింది. స్వర్ణ ఖడ్గం సీరియల్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరైంది సంజన. అయితే.. ఈ భామ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. పెళ్లి చేసుకుని సెటిలైంది. ఈ విషయాన్ని స్వయంగా సంజననే ప్రకటించింది. డ్రగ్స్‌ కేసు కారణంగా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలా ఒత్తిడులు ఎదుర్కొంటున్న సంజనా.. కర్ణాటకలోని పాషా అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకుంది. పాషాకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. అయితే.. సంజనా గల్రాని పెళ్లికి పరిమిత సంఖ్యలో స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. ఇప్పుడు ఈ భామ పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Related posts