telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణమిదే… క్లారిటీ ఇచ్చిన కియారా

Kiara

2014లో తొలిసారిగా కియారా ‘ఫగలీ’ సినిమాతో బాలీవుడ్‌లో కాలు మోపారు. కానీ అక్కడ సరైన హిట్ ను అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. ఆ తరువాత తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ “కబీర్ సింగ్” చిత్రంతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీ సినిమా ‘గుడ్ న్యూస్’తో బిజీగా ఉంది. ఇప్పుడుద్ కియారా తెలుగు సినిమాలు చేయడం తగ్గించింది. తెలుగు నుంచి ఆఫర్స్ వెళితే భారీగా పారితోషికం అడుగుతోందనే వార్తలు వచ్చాయి. తాను అడిగిన దానికి తక్కువగా పారితోషికం ఇస్తే చేయనని నిర్మొహమాటంగా చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కైరా వరకూ వెళ్లడంతో ఆమె స్పందించింది. “తెలుగు నుంచి నాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. అయితే హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే నేను తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాను. తెలుగులో కథ.. నా పాత్ర నచ్చినప్పుడే ఓకే చెప్పాలనే నిర్ణయంతో వున్నాను. అంతేగానీ పారితోషికం తక్కువైతే చేయనని నేను ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు” అంటూ స్పష్టత ఇచ్చింది.

Related posts