telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

నీతులు చెప్పేవాళ్ళు .. ముందు పాటించాలి.. : వాద్రా రాబర్ట్

rabart vadra on womens day

ప్రధాని మోదీ వీఐపీ సంస్కృతి వద్దని చెబుతున్న వ్యాఖ్యలను ఆయన కుటుంబసభ్యులే పట్టించుకోవట్లేదని ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా విమర్శించారు. మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తన భద్రతా సిబ్బందిని తనతో పాటు ఒకే వాహనంలో తీసుకెళ్లేందుకు అభ్యంతరం తెలిపారు. తన భద్రతా సిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలని రెండు రోజుల క్రితం రాజస్థాన్ లో ఆందోళనకు దిగిన విషయమై వాద్రా ఈ విమర్శలు చేశారు.

ఇతరుల్లో ఉన్న చెడు అలవాటు మనలోనూ ఉన్నప్పుడు, ఇతరులను అదే విషయమై విమర్శించొద్దన్న సూక్తి ప్రధాని మోదీకీ వర్తిస్తుందని సూచించారు. వీఐపీ సంస్కృతి ఎందుకుని విమర్శించే మోదీ, తన సోదరుడి విషయంలో ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ‘ఇదేనా అచ్ఛేదిన్?’ అని తన ఫేస్ బుక్ ఖాతాలో వాద్రా ప్రశ్నించారు. గతంలో తన భద్రతా సిబ్బందిని సగానికి తగ్గించారని, తన తల్లి నివాసం వద్ద భద్రతగా ఉండే ఇద్దరిని తొలగించారని అన్నారు. ఈ విషయాలను తామెప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పుకొచ్చారు.

Related posts