telugu navyamedia
రాజకీయ

అంతరిక్షంలో ఉపగ్రహం కూల్చివేత… వీడియో విడుదల చేసిన రక్షణశాఖ

An Anti-Satellite (A-SAT),DRDO

ఇటీవల ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని ప్రయోగించి “మిషన్ శక్తి”ని విజయవంతం చేసిన భారత్, అమెరికా, రష్యా, చైనాల సరసన నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఎర్త్ లోయర్ ఆర్బిట్ లో ఉన్న ఉపగ్రహాన్ని ఏ-శాట్ ఎలా పేల్చివేసిందో తెలియజేస్తూ రక్షణ శాఖ ఓ వీడియోను విడుదల చేసింది. దాదాపు 283 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ కు 3 నిమిషాల్లో కూల్చివేసేలా ఈ ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఒడిశాలోని కలామ్ ఐలాండ్ నుంచి మార్చి 27న ఈ ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. మూడు దశల్లో ప్రయోగం పూర్తికాగా, ఈ వీడియోను డిఫెన్స్ మినిస్ట్రీ, తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

Related posts